ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  తొలిసారి వ్యాపార భాగస్వాములుగా మారిన అంబానీ-అదానీ.. పవర్‌ ప్రాజెక్టులో 26% వాటా కొనుగోలు చేసిన రిలయన్స్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అపర కుబేరులు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ తొలిసారి వ్యాపార భాగస్వాములు అయ్యారు. గుజరాత్‌కు చెందిన వీరిద్దరి మధ్య కనిపించని పోటీ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.

సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం వ్యాపార రంగంలో చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పవర్‌ ప్రాజెక్టులో 26 శాతం వాటాను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. మహాన్‌ ఎనర్జెన్‌లో ఒక్కో షేరు రూ.10 విలువ కలిగిన మొత్తం 5 కోట్ల షేర్లను రిలయన్స్‌ కొనుగోలు చేసింది.

అదే విధంగా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఆర్‌ఐఎల్‌ సొంత అవసరాలకు 20 ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రిలయన్స్‌ – మహాత్‌ మధ్య ఒప్పందం కుదిరింది. సొంత వినియోగ పాలసీలో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్‌తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్‌ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్‌ను సొంత అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది.

కాగా ఇన్నాళ్ల వ్యాపార జీవితంలో అంబానీ, అదానీ ఒకరి వ్యాపారంలో మరొకరు తారసపడిన దాఖలాలు లేవు. అంబానీకి చమురు-గ్యాస్‌ నుంచి టెలికాం దాకా వ్యాపారాలున్నాయి. అదానీకి బొగ్గు తవ్వకం నుంచి విమానాశ్రయాల వరకు వ్యాపార సాంమ్రాజ్యం ఉంది. అయితే వీరిద్దరూ ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహా ఏనాడు వ్యాపార రిత్యా చేతులు కలిపింది లేదు. 5జీ స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు అదానీ గ్రూప్‌ దరఖాస్తు చేసినప్పటికీ.. పబ్లిక్‌ నెట్‌వర్క్‌ కోసం దానిని ఇప్పటి వరకు వినియోగించలేదు. 2022లో అంబానీతో సంబంధమున్న ఒక కంపెనీ ఎన్‌డీటీవీలో తనకున్న వాటాలను అదానీకి విక్రయించింది. ఇక మార్చి నెల ఆరంభంలో ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు అదానీ కూడా హాజరయ్యారు. ఇలా వీరి మధ్య సాన్నిహిత్యానికి తాజా ఒప్పందం బలం చేకూర్చినట్లైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….