ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఆక్షన్ క్రికెట్‌ వేదిక – విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎస్సైలు ప్రయాణికురాలు నెట్టడంతో టైర్ కింద పడ్డ కండక్టర్ కండక్టర్‌కు తీవ్ర గాయాలు పోలీస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి కరకగూడెం, ఏడుళ్ల బయ్యారం, మణుగూరు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అమరవీరుల త్యాగాలే పోలీస్ శాఖకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఘన నివాళులు అర్పించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఎల్‌నినో ఎఫెక్ట్.. పేదలకు ‘అమ్మహస్తం’ తరహా రేషన్? నిత్యావసరాల సబ్సిడీ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలన

  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు కరకగూడెం యువతి దేవి ప్రియ ఎంపిక

తాటిగూడెం గ్రామ క్రీడాకారిణికి అరుదైన అవకాశం.. మండల ప్రజల్లో హర్షం

భద్రాద్రి కొత్తగూడెం ,అక్టోబర్ 26 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన రామటెంకి దేవి ప్రియ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. మేడ్చల్ క్రికెట్ ఏరినా (MCA) బెస్ట్ క్రికెట్ అకాడమీ ద్వారా శిక్షణ పొందుతున్న దేవి ప్రియ జిల్లా జట్టుకు ఎంపిక కావడంతో తాటిగూడెం గ్రామంతో పాటు కరకగూడెం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కోచ్‌లు ఇర్ఫాన్, బుచ్చిబాబు, వెంకట్‌ల మార్గదర్శకత్వంలో దేవి ప్రియ క్రమశిక్షణతో నిరంతరం కఠోర సాధన చేస్తూ క్రికెట్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఆమె ప్రతిభ, పట్టుదల, కృషికి గుర్తింపుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రికెట్ జట్టులో చోటు దక్కింది.

ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులను గుర్తించి, వారికి నాణ్యమైన శిక్షణ అందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మేడ్చల్ క్రికెట్ ఏరినా బెస్ట్ క్రికెట్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కోచ్‌ల శిక్షణ, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం యువ క్రీడాకారుల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు.

దేవి ప్రియ తల్లిదండ్రులు రామటెంకి హనుమంతరావు, ఉమామహేశ్వరి అందించిన ప్రోత్సాహంతో పాటు కోచ్‌ల మార్గదర్శకత్వం ఆమె విజయానికి తోడ్పడిందని పలువురు అభిప్రాయపడ్డారు. రాబోయే పోటీల్లో దేవి ప్రియ అద్భుత ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని కోచ్‌లు ఆకాంక్షించారు.

తాటిగూడెం గ్రామానికి చెందిన యువతి జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం ఇతర యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందని గ్రామస్థులు పేర్కొన్నారు. భవిష్యత్తులో దేవి ప్రియ క్రికెట్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, క్రీడాకారులు, గ్రామస్థులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

– ఆధాబ్ న్యూస్
www.aadhabnews.in

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు