కరకగూడెం నవోదయ స్కూల్ విద్యార్థుల ర్యాలీ
కరకగూడెం, ఆగస్టు 14 (ఆధాబ్ న్యూస్): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండలంలోని నవోదయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని “హర్ ఘర్ తిరంగా” నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్కూల్ ప్రిన్సిపాల్ రత్తయ్య పిలుపునిచ్చారు.
Post Views: 106









