ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కష్టకాలంలో తోడుగా కాంగ్రెస్ పార్టీ మృతుడి కుటుంబానికి 75 కేజీల బియ్యం అందజేత

కష్టకాలంలో తోడుగా కాంగ్రెస్ పార్టీ

మృతుడి కుటుంబానికి 75 కేజీల బియ్యం అందజేత

కరకగూడెం, ఆగస్టు 13 (ఆధాబ్ న్యూస్): కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ. పాయం వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు కొమరం రాంగోపాల్ ఇటీవల మృతి చెందగా, ఆయన దశదిన కర్మల నిమిత్తం కుటుంబ సభ్యులకు మొత్తం 75 కేజీల బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 25 కేజీల బియ్యం, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు 25 కేజీలు, మహిళా నాయకురాలు పూనెం శ్యాం కుమారి 25 కేజీల బియ్యాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు, కష్టకాలంలో కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు గొగ్గలి రవి, పోలేబోయిన సీతారాంబాబు, బిలపాటి సంపత్, ఉప సర్పంచ్ ఈసం కోటేశ్వరరావు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….