మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత
కరకగూడెం, ఆగస్టు 12 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కొమరం లక్ష్మిబాయి కుమారుడు కొమరం రాంగోపాల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, పార్టీ శ్రేణులు బుధవారం మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రావుల సోమయ్య మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కొమరం రాంగోపాల్ దశదిన కర్మలకు ఉపయోగపడేలా కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యంతో పాటు అవసరమైన సామగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు కొమరం సత్యనారాయణ, వట్టం సందీప్, మాజీ సర్పంచ్ పాపక్క, మండల నాయకులు బుడగం రాము, బైరిశెట్టి చిరంజీవి, గుడ్ల రంజిత్, కటకం లెనిన్, యల్లి రామకృష్ణారెడ్డి, గొగ్గల నరసయ్య, యగ్గడి శ్రీను, పోలెబోయిన దిలీప్, రాజశేఖర్, గొంది పద్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









