ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కరకగూడెం JAC ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివాసుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: డా. చందా లింగయ్య దొర

కరకగూడెం JAC ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ఆదివాసుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి: డా. చందా లింగయ్య దొర

జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీం స్ఫూర్తితో ముందుకు సాగాలి

జై ఆదివాసి.. జై కొమరం భీం నినాదాలతో మార్మోగిన కరకగూడెం

కరకగూడెం, ఆగస్టు 09 (ఆధాబ్ న్యూస్): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండల JAC కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బ్యాంకు వద్ద నుంచి ఆదివాసులు, JAC నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించి సంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీగా బట్టుపల్లి (విరాపురం) ఎక్స్‌ రోడ్ వద్ద ఉన్న ఆదివాసీ ఉద్యమ నాయకుడు కొమరం భీం విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించి, కొమరం భీం విగ్రహానికి గజమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా “ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి.. జై ఆదివాసి.. జై కొమరం భీం” అంటూ నినాదాలు చేశారు.

హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఆదివాసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ZP చైర్మన్ డా. చందా లింగయ్య దొర హాజరై మాట్లాడారు. జల్, జంగిల్, జమీన్ కోసం పోరాడిన కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను తామే కాపాడుకోవాలని, ఆదివాసీ సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.

ఆదివాసీ ఐక్యతే తమ బలమని, హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, JAC నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, అభిమానులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….