ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  ఇసుక లారీల రాకపోకలతో ప్రజల్లో భయాందోళన రోడ్లు ధ్వంసమవుతాయి.. కల్వర్టులు దెబ్బతినే ప్రమాదం: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రంజిత్ కుమార్

ఇసుక లారీల రాకపోకలతో ప్రజల్లో భయాందోళన

రోడ్లు ధ్వంసమవుతాయి.. కల్వర్టులు దెబ్బతినే ప్రమాదం: బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రంజిత్ కుమార్

కరకగూడెం, ఆగస్టు 08 (ఆధాబ్ న్యూస్):
ములుగు జిల్లా తాడ్వాయి మీదుగా కాటాపురం, రంగాపురం, కరకగూడెం, పినపాక వైపు అధిక సంఖ్యలో ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంటుందని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక లారీలు అతివేగంగా, నిబంధనలకు విరుద్ధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రస్తుతం బాగున్న రహదారులు సైతం పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

అంతేకాకుండా భారీ ఇసుక లారీల కారణంగా మార్గమధ్యంలోని కల్వర్టులు, వంతెనలు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉందని రంజిత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతింటే గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యావసర సరుకుల కోసం సైతం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

ప్రస్తుతం మూడు రోజుల సెలవులు ఉండటంతో పిల్లలు, విద్యార్థులు ఆడుకోవడానికి బయటకు వస్తున్నారని, ఇసుక లారీల వేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా వారికి ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు సైతం భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకునే నాథుడే లేడన్న పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక లారీల రాకపోకలను నియంత్రించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేసే లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….