ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కరకగూడెం మీదుగా ఇసుక లారీల రాకపోకలకు అడ్డుకట్ట బ్రిడ్జిలపై అధిక భారంతో ప్రమాదం.. డ్రైవర్లకు ఎస్సై హెచ్చరికలు

 

కరకగూడెం మీదుగా ఇసుక లారీల రాకపోకలకు అడ్డుకట్ట

బ్రిడ్జిలపై అధిక భారంతో ప్రమాదం.. డ్రైవర్లకు ఎస్సై హెచ్చరికలు

కరకగూడెం, ఆగస్టు 08 (ఆధాబ్ న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో అధిక సంఖ్యలో సంచరిస్తున్న ఇసుక లారీల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోలీసులు స్పందించారు. కరకగూడెం ఎస్సై పీవీ నాగేశ్వరరావు శనివారం ఇసుక లారీలను అడ్డుకుని డ్రైవర్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.

వరంగల్ నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలు ములుగు, ఏటూరునాగారం, జానంపేట, పినపాక మార్గంలో ప్రయాణించాల్సి ఉండగా, కొంతమంది డ్రైవర్లు తాడ్వాయి–వై జంక్షన్ మీదుగా కరకగూడెం రహదారిని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు, దుమ్ము కాలుష్యంతో పాటు రహదారి భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా అధిక లోడుతో ఇసుక లారీలు గ్రామీణ రహదారులపై ఉన్న వంతెనలపై ప్రయాణించడం వల్ల వాటిపై అదనపు భారం పడటంతో వంతెనలు దెబ్బతిని, భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎస్సై పీవీ నాగేశ్వరరావు కరకగూడెం మీదుగా వెళ్తున్న ఇసుక లారీలను నిలిపివేసి, నిర్ణయించిన మార్గాల్లోనే ప్రయాణించాలని డ్రైవర్లకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కరకగూడెం రూట్‌ను వినియోగించవద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….