FFS యాప్ ద్వారా రైతులకు డీఏపీ ఎరువుల పంపిణీ
ఆధాబ్ న్యూస్, కరకగూడెం ఆగస్టు 7:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ సేల్ (FFS) యాప్ ద్వారా రైతులకు డీఏపీ ఎరువుల పంపిణీ చేపట్టారు. రైతుల వివరాలు, భూమి విస్తీర్ణం, పంట వివరాలను యాప్‌లో నమోదు చేసి, అవసరానికి అనుగుణంగా పారదర్శకంగా ఎరువులను అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, FFS యాప్ వినియోగంతో ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం, పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకుని అవసరమైన ఎరువులను సకాలంలో పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ADA) దాతరావు, మండల వ్యవసాయ అధికారి (MAO) మహేష్ చంద్ర చటర్జీ, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) అనిల్, రామాదేవి పాల్గొని రైతులకు డీఏపీ ఎరువులను పంపిణీ చేశారు. రైతులు కొత్త విధానాన్ని స్వాగతిస్తూ వ్యవసాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.









