మృతుడి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ నాయకులు
దశదిన కర్మలకు 50 కేజీల బియ్యం అందజేత
కరకగూడెం, ఆగస్టు 1 (ఆధాబ్ న్యూస్):
కరకగూడెం మండలం చొప్పాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి మెంగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు శనివారం మెంగయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రావుల సోమయ్య మాట్లాడుతూ, కష్టసుఖాల్లో మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మెంగయ్య దశదిన కర్మల నిర్వహణకు ఉపయోగపడేలా కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు కుమ్మరి సమ్మయ్య, బుడగం రాము, మాజీ ఉపసర్పంచ్ అత్తె సత్యనారాయణ, కొండగొర్ల కోటి, పాయం కృష్ణ, కొండగొర్ల నరసింహారావు, కుమ్మరి కుమార్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









