ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్

భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్

భద్రాచలం, జూలై 25 (ఆధాబ్ న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వీరభద్రం ఫంక్షన్ హాల్ సమీపంలోని కూనవరం రోడ్డుపై నిర్వహించిన తనిఖీల్లో 101 కిలోల డ్రై గంజాయిని పట్టుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మోతుగూడెం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు డ్రై గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ KA-03-NR-5892 గల మారుతి ఎర్టిగా కారును తనిఖీ చేయగా, అందులో 101 కిలోల డ్రై గంజాయి లభ్యమైంది.

ఈ సందర్భంగా గంజాయి రవాణాకు ఉపయోగించిన మారుతి ఎర్టిగా కారుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

ప్రాథమిక విచారణలో నిందితులు మోతుగూడెం నుంచి గంజాయిని భద్రాచలం–ఖమ్మం మార్గం మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ దాడిలో సీఐ రహీమున్నీసా, ఎస్‌ఐ సీతారామరాజు, హెడ్ కానిస్టేబుల్ కరీమ్‌తో పాటు పోలీసు సిబ్బంది భద్రం, సీతారాం, రాకేష్, రవి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….