ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  మహిళలు, బాలికల భద్రతకు “పోలీస్ అక్క” కార్యక్రమం కీలకం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

మహిళలు, బాలికల భద్రతకు “పోలీస్ అక్క” కార్యక్రమం కీలకం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25 (ఆధాబ్ న్యూస్):

జిల్లాలో మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అమలు చేయనున్న “పోలీస్ అక్క” కార్యక్రమంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మహిళా పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు తదితర విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా పోలీసులకు సూచించారు. ముఖ్యంగా బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ర్యాగింగ్ నిరోధం, బుల్లీయింగ్, ఈవ్ టీజింగ్, స్టాకింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విద్యార్థులు ఎలాంటి వేధింపులు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించేలా ధైర్యం నింపాలని, మహిళలు, బాలికల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. “పోలీస్ అక్క” కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో భద్రతపై అవగాహన పెరగడంతో పాటు పోలీసులపై విద్యార్థులు, మహిళల్లో విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….