హైదరాబాద్, జూలై 24 (ఆధాబ్ న్యూస్):
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ యువతతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) శుక్రవారం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువతతో కలిసి ఆందోళన నిర్వహించారు.
విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కేటీఆర్ అన్నారు. విద్యా వ్యవస్థలో జరిగిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం సందర్భంగా ఇందిరా పార్క్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.









