పర్యటనకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మణుగూరు, ఆధాబ్ న్యూస్ 23: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మణుగూరులో భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (BTPS) ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
అనంతరం సింగరేణి ఉపరితల గనులను సందర్శించి, గనుల నిర్వహణ, ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం.
కాగా, గురువారం ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి సింగరేణి గనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలించి, అక్కడ గనుల పనితీరు, భద్రతా చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మణుగూరు పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది.









