ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  రెండేళ్లుగా ఫిజిక్స్ టీచర్ లేరు.. 50 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో

రెండేళ్లుగా ఫిజిక్స్ టీచర్ లేరు.. 50 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో

అనంతారం జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థుల ఆవేదన.. వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని విజ్ఞప్తి

కరకగూడెం, జూలై 20 (ఆధాబ్ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో గత రెండేళ్లుగా ఫిజిక్స్ సబ్జెక్టుకు శాశ్వత ఉపాధ్యాయుడు లేకపోవడంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిజిక్స్ సబ్జెక్టుకు కేటాయించబడిన ఉపాధ్యాయురాలు రెండేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై పాల్వంచలోని జడ్‌పీహెచ్‌ఎస్ కేటీపీఎస్ పాఠశాలకు వెళ్లినప్పటి నుంచి అనంతారం పాఠశాలలో ఆ పోస్టు ఖాళీగానే ఉందని విద్యార్థులు తెలిపారు.

దీంతో ఫిజిక్స్ సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుడు లేక సుమారు 50 మంది విద్యార్థులు విద్యాభ్యాసంలో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతిలో ఫిజిక్స్ అత్యంత కీలకమైన సబ్జెక్టు అయినప్పటికీ, గత రెండేళ్లుగా ఎవరూ సక్రమంగా బోధించకపోవడంతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలమా అనే ఆందోళన నెలకొందని విద్యార్థులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే అనంతారం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలకు ఫిజిక్స్ ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని, జిల్లా విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.

అధికారులు స్పందించి వెంటనే ఉపాధ్యాయుడిని నియమించి తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….