ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  వలస ఆదివాసీలకు రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

వలస ఆదివాసీలకు రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

70 కుటుంబాలకు సోలార్ లైట్లు, చీరలు, నిత్యావసర సరుకుల పంపిణీ

ఆధాబ్ న్యూస్ – కరకగూడెం, జూలై 18:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన నీలాద్రిపేట గండి మరియు అశ్వాపురంపాడు గ్రామాల్లో నివసిస్తున్న 70 వలస ఆదివాసి కుటుంబాలకు రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ దాతల సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి సోలార్ లైట్లు, చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడుల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై పి.వి. నాగేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పి.వి. నాగేశ్వరరావు మాట్లాడుతూ, వలస ఆదివాసీలు మద్యం, గంజాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సమాజంలో మంచి గుర్తింపు పొందేలా జీవించాలని సూచించారు. అలాగే తమ పిల్లలను ఉన్నత విద్య చదివించి మంచి భవిష్యత్తు కల్పించాలని కోరారు.

అనంతరం, మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు సేవలందిస్తూ సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్న రాబిన్ హుడ్ ఆర్మీ స్వచ్ఛంద సంస్థ సేవలను అధికారులు అభినందించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రాబిన్ హుడ్ ఆర్మీ సభ్యులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….