అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. ఎస్సై పి.వి ఎన్ రావు చాకచక్యం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో శుక్రవారం రాత్రి ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న గోవులను కరకగూడెం పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పందించిన కరకగూడెం ఎస్సై పివిఎన్. రావు సిబ్బందితో కలిసి ట్రాలీని అడ్డగించి తనిఖీ చేయగా గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మణుగూరు పశువైద్యశాఖ వైద్యులచే గోవులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం గోవులను పాల్వంచ గోశాలకు భద్రతతో తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జంతువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పివిఎన్ రావు పేర్కొన్నారు.
Post Views: 26









