ప్రతి క్షణం
ప్రజల పక్షం

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు

  108 అంబులెన్స్ లేక ప్రజలకు అవస్థలు జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే 108 వాహనం ఏర్పాటు చేయాలి : సిపిఐ మండల కార్యదర్శి తోగటి కుమార్

108 అంబులెన్స్ లేక ప్రజలకు అవస్థలు
జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెంటనే 108 వాహనం ఏర్పాటు చేయాలి : సిపిఐ మండల కార్యదర్శి తోగటి కుమార్

ఆధాబ్ న్యూస్, పినపాక, మే 7:
పినపాక మండల కేంద్రంలోని జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ వాహనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా జానంపేట ఆసుపత్రికి 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలంలో అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ అందుబాటులో ఉంటే ఆక్సిజన్ తదితర వైద్య సదుపాయాలతో రోగుల ప్రాణాలను కాపాడటం సులభమవుతుందని తెలిపారు.

మండలంలోని పేద ప్రజలకు జానంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్య కేంద్రంగా మారిందని, ప్రతిరోజూ ఓపీ విభాగానికి అనేక మంది రోగులు వస్తున్నారని చెప్పారు. అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో వైద్యులు జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినప్పటికీ ఆసుపత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

108 అంబులెన్స్‌కు ఫోన్ చేసినా సమయానికి రాకపోవడంతో రోగులను మెరుగైన చికిత్స కోసం దూర ప్రాంతాలకు తరలించేందుకు ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా వైద్య ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి జానంపేట ప్రభుత్వ ఆసుపత్రికి శాశ్వతంగా 108 అంబులెన్స్ వాహనం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని తోగటి కుమార్ కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….