ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం పేషెంట్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం
పేషెంట్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పది తులాల బంగారంతో పరార్

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ హల్‌చల్ చేయడంతో కలకలం రేగింది. ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, ఆమె వద్ద ఉన్న సుమారు పది తులాల బంగారాన్ని తీసుకుని పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం ప్రకారం, ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. డిశ్చార్జ్ చేసే సమయంలో యాప్రాన్ ధరించిన ఓ మహిళ డాక్టర్‌లా నటిస్తూ రోగి గదిలోకి వెళ్లింది. ముందుగా చికిత్స చేయాల్సి ఉందని చెప్పి, పేషెంట్ బంధువులను గది బయటకు వెళ్లమని సూచించింది.

కొద్దిసేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. అదే సమయంలో ఆమె ధరించిన సుమారు పది తులాల బంగారం కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తమైంది. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేశారు. అయితే గదిలోకి వచ్చిన మహిళ ఎవరో తమకు తెలియదని యాజమాన్యం సమాధానం ఇచ్చినట్లు బంధువులు తెలిపారు.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాప్రాన్ ధరించిన మహిళ నర్సింగ్ స్టాఫ్ రూమ్ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం. తెలిసిన వ్యక్తి చేశాడా లేక బయటి వ్యక్తి చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….