మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహణ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరకగూడెం వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ స్పెషలిస్ట్ వైద్య శిబిరంలో పలువురు నిపుణులైన వైద్యులు పాల్గొని మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగుల ఆరోగ్య సమస్యలను పరిశీలించి అవసరమైన చికిత్స సూచనలు అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ శిబిరం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నిపుణుల వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









