ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  పినపాక మండలంలో YVR చిల్డ్రెన్ & వెల్ఫేర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

పినపాక మండలంలో YVR చిల్డ్రెన్ & వెల్ఫేర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో YVR Children & Welfare Trust (Young Vision for the Rural) ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా పినపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎడుళ్లబయ్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దూగినెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జనంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్లు, పెన్సిళ్లు, ఏరేజర్లు, లాంగ్ స్కేల్‌లు, నోట్‌బుక్స్, చిన్న బ్యాగులు, జియామెట్రీ బాక్స్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఈ విద్యాసామగ్రి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.

అదేవిధంగా మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు డ్రాయింగ్ పుస్తకాలు మరియు క్రాయాన్లు అందజేసి, వారి సృజనాత్మకతను పెంపొందించే విధంగా పలు ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రామటెంకి రమేష్, దేవి మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలలో చదివే అవకాశం కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….