ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  హైదరాబాద్‌లో GHMC ఎగ్జామినర్ ACB వలలో… ₹35,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్

హైదరాబాద్‌లో GHMC ఎగ్జామినర్ ACB వలలో… ₹35,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్

హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: నగరంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి గట్టి దెబ్బ కొట్టింది. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న GHMC అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను ₹35,000 లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే… ఒక ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైల్‌ను GHMC హెడ్ ఆఫీస్‌కు పంపించేందుకు ఎగ్జామినర్ మొదట ₹40,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఒప్పందం ప్రకారం ₹35,000 తీసుకుంటుండగా ACB అధికారులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు.

ఫిర్యాదు ఆధారంగా ముందుగా ట్రాప్ ఏర్పాటు చేసిన ACB అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ₹35,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ACB అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు ఇవ్వబోమని, లంచం అడిగిన అధికారులపై వెంటనే ACB కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….