ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  జర్నలిస్ట్ కప్ 2026 విజేతగా బిటిపీఎస్ జట్టు రన్నర్స్‌గా నిలిచిన ఏడూళ్ల బయ్యారం పోలీస్ జట్టు విజేతలకు బహుమతులు అందజేసిన ప్రెస్ క్లబ్

జర్నలిస్ట్ కప్ 2026 విజేతగా బిటిపీఎస్ జట్టు
రన్నర్స్‌గా నిలిచిన ఏడూళ్ల బయ్యారం పోలీస్ జట్టు
విజేతలకు బహుమతులు అందజేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కీసర సుధాకర్ రెడ్డి

పినపాక ,ఆధాబ్ న్యూస్: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్చిరెడ్డిపల్లి క్రికెట్ మైదానంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో బిటిపీఎస్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలవగా, ఏడూళ్ల బయ్యారం పోలీస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

ఫైనల్ పోటీలో ముందుగా బ్యాటింగ్ చేసిన బిటిపీఎస్ జట్టు నిర్ణీత 8 ఓవర్లలో 82 పరుగుల భారీ స్కోరు సాధించింది. జట్టులో వెంకట్ 46 పరుగులు చేసి రాణించగా, ఓపెనర్ గట్ల నవీన్ 26 పరుగులతో కీలకంగా నిలిచాడు. లక్ష్య చేధనకు దిగిన పోలీస్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ, మధ్యవరుస ఆటగాళ్లు పోరాటపటిమ కనబరిచారు. అయితే చివరి ఓవర్లలో ఒత్తిడిని తట్టుకోలేక మ్యాచ్‌ను చేజార్చుకున్నారు.

టోర్నమెంట్ ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కీసర సుధాకర్ రెడ్డి అతిథులతో కలిసి విజేత బిటిపీఎస్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన పోలీస్ జట్టుకు రన్నరప్ ట్రోఫీ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల ద్వారా స్నేహభావాన్ని పెంపొందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌కు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ టోర్నమెంట్‌లో ప్రధమ బహుమతిని మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పోస్ట్ వెంకటరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పగడాల సతీష్ రెడ్డి స్పాన్సర్ చేయగా, ద్వితీయ బహుమతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం స్పాన్సర్ చేశారు.

ఈ కార్యక్రమంలో గొడిశాల రామనాథం, పగడాల సతీష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు బూరా శంకర్, బిల్లా నాగేందర్, ముక్కు మహేష్ రెడ్డి, సనపా భరత్, కొంపెల్లి సంతోష్, బుయ్యవరపు భాస్కర్, గంగిరెడ్డి సతీష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….