ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  తెలంగాణలో సర్పంచ్‌లకు కొత్త అధికారాలు అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లకే

తెలంగాణలో సర్పంచ్‌లకు కొత్త అధికారాలు

అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లకే
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
అక్రమాలను అరికట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

గ్రామాల్లో గత రెండేళ్లుగా ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమయంలో పౌష్టికాహారం పక్కదారి పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు రావడంతో, తాజాగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా వ్యవహరించగా, ఏఎన్‌ఎం, ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు కమిటీ సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుతున్న బియ్యం, పప్పులు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార సరుకుల నాణ్యత, పంపిణీని తనిఖీ చేయనుంది. అలాగే ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా పర్యవేక్షిస్తుంది.

లక్షల రూపాయల విలువైన పౌష్టికాహారం అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడటం, అక్రమాలకు చెక్ పెట్టడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….