ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ: మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య

హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ: మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య

భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
“తల మీదే – రక్షణ మీదే” అనే సత్యాన్ని ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు గుర్తించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు. హెల్మెట్ ధారణ ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి. రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది కలిసి కార్యాలయానికి వచ్చిన ప్రజల హెల్మెట్లకు “నన్ను ధరించి నిన్ను రక్షిస్తా” అనే నినాదంతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించి హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు నాణ్యమైన హెల్మెట్‌ను తలకు సరిగ్గా ధరించి, మెడ వద్ద బెల్ట్ క్లిప్‌ను బిగువుగా అమర్చుకుని ప్రయాణం చేయాలని సూచించారు. హెల్మెట్‌ను సక్రమంగా ధరిస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తీవ్రమైన గాయాలు తగలకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

మనము జీవించి ఉంటేనే మన కుటుంబానికి రక్షణగా నిలబడగలమని పేర్కొంటూ, హెల్మెట్ ధారణను అలవాటుగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేసి వారిని ఈ అలవాటుకు ప్రోత్సహించాలని కోరారు.

అలాగే సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో లేదా అతివేగంతో డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టి తమతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి. రాజశేఖర్ రెడ్డి, ఏఎంవీఐ, కానిస్టేబుల్ ఎన్. శివయ్య, సిబ్బంది భీముడు, అలాగే వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….