ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తికి కృత్రిమ కాలు అమరిక ★దాతలు శ్రీనివాసరావు, కస్తూరి దంపతులకు,మహర్షి స్వచ్ఛంద సంస్థ కు ధన్యవాదాలు ★ముదురుకాళ్ల సారంగపాణి

మహర్షి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యక్తికి కృత్రిమ కాలు అమరిక
★దాతలు శ్రీనివాసరావు, కస్తూరి దంపతులకు,మహర్షి స్వచ్ఛంద సంస్థ కు ధన్యవాదాలు
★ముదురుకాళ్ల సారంగపాణి

★మరింత మంది దాతలు ముందుకు వస్తే సేవ చేస్తా
★మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: ఓ రోడ్డు ప్రమాదం ఆ వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది… గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో ఎడమ కాలు ను కోల్పోయిన ఆ వ్యక్తి అచేతనంగా మారాడు.ఈ నేపథ్యంలో నేను ఉన్నాను అంటూ పినపాక మండలానికి చెందిన మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు ముందుకు వచ్చారు.వివరాలు కరకగూడెం మండలం గోళ్లగూడెం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు ముదురుకాళ్ల సారంగపాణి2019లో జరిగిన రోడ్డు ప్రమాదం లో తన ఎడమ కాలు కోల్పోయాడు. ఆ నాటి నుంచి కాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు బాధిత వ్యక్తి ని పరామర్శించారు.సారంగపాణి దుస్థితి దాతల దృష్టి కి తీసుకవేళ్ళారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయవాడకు చెందిన దాతలు శ్రీనివాసరావు, కస్తూరి దంపతులు సారంగపాణి కి కికృత్రిమ కాలు అమరిక కు ఆర్ధిక సహాయం అందించారు.కాగా జున్ను నాగరాజు అనే వ్యక్తి సహాయం తో ,విజయవాడలో ని ఇవోల్యూషన్ సెంటర్ లో
మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు తోలెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సారంగపాణి ఎడమ కాలుకు కృత్రిమ కాలు అమర్చారు. ఈ సందర్భంగా దాతలకు, మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ముందుకు వస్తే మరింతమంది నిరుపేదలకు సేవ చేస్తానని మహర్షి స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….