ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  తుది విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

తుది విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిస్థాయిలో, ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.

జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, అల్లపల్లి, గుండాల, టేకులపల్లి మండలాల్లో జరగనున్న తుది విడత ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి మరియు రెండవ విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. గత విడతల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తుది విడతలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

రేపు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామాగ్రి పంపిణీ జరగనున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. అల్లపల్లి మండలానికి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గుండాల మండలానికి టిటిడబ్ల్యుఆర్‌జేసీ బాలుర పాఠశాల, జూలూరుపాడు మండలానికి జెడ్పిహెచ్ఎస్, లక్ష్మీదేవిపల్లి మండలానికి ప్రశాంత్‌నగర్ జీపీ పరిధిలోని శ్రీరామ చంద్ర డిగ్రీ కాలేజ్, సుజాతనగర్ మండలానికి జిల్లా పరిషత్ హై స్కూల్, టేకులపల్లి మండలానికి గోల్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్, ఇల్లందు మండలానికి ఎస్‌సీసీఎల్ హై స్కూల్ వద్ద డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కేంద్రాల ద్వారా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటర్ రిజిస్టర్లు, ఎన్నికల స్టేషనరీ తదితర సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి క్రమబద్ధంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. సామాగ్రి తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసి, ఎటువంటి ఆలస్యం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల్లో రద్దీ లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ రిజిస్టర్‌ను కచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఓటరును ధృవీకరించిన అనంతరమే ఓటు వేయడానికి అనుమతించాలని, దొంగ ఓట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను తప్పనిసరిగా అమలు చేసి, వీడియో కెమెరాల ద్వారా బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నిర్ణీత రూట్ మ్యాప్ ప్రకారం కౌంటింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని, బ్యాలెట్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్‌లో మాత్రమే భద్రపరచాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, రెండు వేలకుపైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాలని సూచించారు. కౌంటింగ్ హాళ్లలో అవసరమైనన్ని టేబుళ్లు ఏర్పాటు చేసి, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి భోజనం, తాగునీరు, రవాణా వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలను ఆదేశించారు. తుది విడత పంచాయతీ ఎన్నికలు పూర్తిగా విజయవంతం కావాలంటే ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….