ప్రతి క్షణం
ప్రజల పక్షం

దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….

  బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపు

బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: స్థానిక ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మొగ్గుచూపుతున్నారని మండల అధ్యక్షులు రావుల సోమయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఓటు అనేది ఎవరి కృప కాదు… ఇది ప్రజాస్వామ్య హక్కు. అధికార పార్టీ సర్పంచ్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనడం ప్రజలను భయపెట్టే రాజకీయ కుట్ర మాత్రమే. గ్రామం ఎలా ముందుకు వెళ్తుందో నిర్ణయించేది పార్టీ కాదు, ప్రజల ఐక్యత, ప్రజల ఇష్టం” అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రజలను మోసం చేశాయని, రెండు సంవత్సరాల పాలనలో అభివృద్ధి పేరుతో గ్రామాల్లో కనిపించేదేమీ లేదని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, “శాంక్షన్ అయిన రోడ్లు, బ్రిడ్జిలు కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయలేదు. గ్రామాల్లో అంధకారం, చెత్త సేకరణలో నిర్లక్ష్యం, ప్రజల సౌకర్యాల పట్ల పట్టింపు లేకపోవడం కొనసాగుతోంది” అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు భారీ హామీలు ఇచ్చి, అమలు విషయంలో కాలయాపన చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని చెప్పారు. మండల వ్యాప్తంగా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారని, రాబోయే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో మొత్తం 16 గ్రామ పంచాయతీలలో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ మెంబర్లను మీ ఓటుతో గెలిపించాలని సోమయ్య కోరారు.

“కాంగ్రెస్‌కు ఓటుతో తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఇది” అని మండల అధ్యక్షులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….