ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు – భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు కట్టుదిట్టమైన బందోబస్తు – భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
పాల్వంచలోని నవ భారత ప్రాంతంలో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనుండడంతో జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బందోబస్తు వివరాలు:

అదనపు ఎస్పీలు – 01

డీఎస్పీలు – 05

సిఐలు – 30

ఎస్సైలు – 62

ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు – 300

హోమ్‌గార్డులు – 160

స్పెషల్ పార్టీలు – 07

ఏఆర్ ప్లాటూన్లు – 02

మొత్తం 900 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పర్యటన భద్రత కోసం నియోజకవర్గంలోని కీలక ప్రాంతాల్లో మోహరించనున్నట్లు ఎస్పీ వివరించారు.

భద్రతకు 15 సెక్టర్లు:
సీఎం పర్యటన మార్గాన్ని 15 సెక్టర్లుగా విభజించి, ప్రతి సెక్టర్‌కు డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక భద్రతా బృందాలు అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తాయని ఎస్పీ చెప్పారు.

అనుమానాస్పదులపై కఠిన చర్యలు:
పర్యటన సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు. తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహించాలని ఎస్పీ సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్