ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  51.9 కిలోల గంజాయి పట్టివేత కారు, బైక్ సీజ్ – ఇద్దరు అరెస్ట్ – మూడో వ్యక్తి పరారీలో

51.9 కిలోల గంజాయి పట్టివేత
కారు, బైక్ సీజ్ – ఇద్దరు అరెస్ట్ – మూడో వ్యక్తి పరారీలో

భద్రాచలం,ఆధాబ్ న్యూస్: ఒడిశా నుంచి కేరళకు కారు ద్వారా అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఖమ్మం ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ బృందం పట్టుకుంది. భద్రాచలం కూనవరం క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ పట్టివేత జరిగింది.

ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బంది కలిసి కారును ఆపి తనిఖీ చేయగా, కారు ఇంజన్‌లో దాచిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వాటిని తూకం వేయగా 51.9 కిలోల గంజాయిగా నమోదు అయింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ₹26 లక్షలుగా అధికారులు అంచనా వేశారు.

అక్రమ రవాణాలో ఉపయోగించిన కారు, ఒక బైకును కూడా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.

ఈ కేసులో కేరళకు చెందిన జకారియా పర్యాల్, నసిర పూర్తియా వేట్టల్లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కందుల రవి (సూర్యాపేట) పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని, స్వాధీనం చేసిన గంజాయి మరియు వాహనాలను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ సీఐకి అప్పగించారు.

ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ ఆపరేషన్ జరిగినట్లు ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ గణేష్ తెలిపారు. కేసు దర్యాప్తును ఏఈఎస్ కరం చంద్ చేపట్టనున్నారు.

భారీ మొత్తంలో గంజాయి పట్టివేతలో చురుకైన పాత్ర పోషించిన ఎక్సైజ్ సిబ్బందిని డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….