ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలిజిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి

— జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
రాబోయే రెండు రోజుల్లో తుపాను ప్రభావంతో జిల్లాలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశముందని, అటువంటి ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రహదారులు, వంతెనలు, వాగులు దాటేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, విద్యుత్ తీగలు తెగిపోయిన ప్రదేశాలు, చెట్లు కూలిన ప్రాంతాలకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు అవసరం లేని బయట ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు.

వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వరి పంట కోతలు రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన ధాన్యాన్ని ఎత్తయిన ప్రదేశాలకు తరలించి టార్పాలిన్‌తో కప్పి రక్షించుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్‌లు, కొనుగోలు కేంద్రాల వద్ద నీటి నిల్వలను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పంటను సురక్షితంగా ఉంచేందుకు రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చని కలెక్టర్ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….