ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన శ్రీతేజకు ఘన సన్మానం

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన శ్రీతేజకు ఘన సన్మానం

కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన తోలెం వెంకటేశ్వర్లు–మల్లేశ్వరి దంపతుల కుమార్తె శ్రీతేజ జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. డిగ్రీ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్న ఆమె, ఇటీవల ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటుతూ స్వర్ణ పతకం గెలుచుకుంది.

ఈ సందర్భంగా మంగళవారం కరకగూడెం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీతేజకు ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు శ్రీతేజ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు కొమరం సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ నిట్టా సౌందర్య రావు, సెక్రటరీ గుడ్ల రంజిత్ కుమార్, క్యాషియర్ సాధనపెల్లి లక్ష్మినారాయణ, సభ్యులు రావుల వేణు, కాటి సాంబశివరావు, ముత్యాల మధు, నిట్టా వెంకన్న, తోట శివ, బాదె సాగర్, ఓంకార్, శ్రావణ్, అలాగే కరకగూడెం పంచాయితీ సెక్రటరీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్