ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వెంకటాపురం యువత ఆదర్శం – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

వెంకటాపురం యువత ఆదర్శం – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబం కొమరం నాగేశ్వరరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావు భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని తెలిసిన వెంకటాపురం గ్రామ ఆదివాసీ యువత హృదయాన్ని కలిచివేసింది.
మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన వెంకటాపురం గ్రామ యువకులు చందాలు సేకరించి రూ.6100/- ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

గ్రామ పెద్దలు పోలెబోయిన రామారావు, పోలెబోయిన వెంకటనారాయణ, చందా ప్రదీప్, పూనెం లక్ష్మణ్, కొమరం వరుణ్, కొమరం ప్రశాంత్, కొమరం ప్రవీణ్, సోలం కృష్ణ తదితరులు పాల్గొని యువత సేవాభావాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, “ఇకముందు ఇలాంటి దుర్ఘటనలు ఎదురైనప్పుడు ప్రతి ఆదివాసీ యువకుడు ఇలాగే ముందుండాలి” అని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్