ప్రతి క్షణం
ప్రజల పక్షం

కేజీబీవీ హాస్టల్‌లో కోతుల బెడద విద్యార్థుల భద్రతకు అటవీశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు . అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఎంపిక ప్రక్రియ పారదర్శకం జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శ. ఇంటి పర్మిషన్ కోసం రూ.13 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు

  పినపాక, కరకగూడెం మండలంలో క్రాకర్స్ షాపులకు అనుమతి తప్పనిసరి ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ హెచ్చరిక

పినపాక,కరకగూడెం మండలంలో క్రాకర్స్ షాపులకు అనుమతి తప్పనిసరి
ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ హెచ్చరిక

కరకగూడె,ఆధాబ్ న్యూస్: దీపావళి పర్వదినం సందర్భంగా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న క్రాకర్స్ షాపులపై అగ్నిమాపక శాఖ అధికారులు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రతి వ్యాపారి తప్పనిసరిగా ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకుని మాత్రమే షాపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

క్రాకర్స్ షాపులు ఏర్పాటు చేసే సమయంలో కింది నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు.

షాపులు ఓపెన్ ఏరియాలో, అనుమతి పొందిన ప్రదేశంలోనే ఏర్పాటు చేయాలి.

షాప్ నిర్మాణం క్లాత్, వుడ్, టార్పాలిన్ వంటి కాలే వస్తువులతో చేయరాదు.

వైరింగ్ పనులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ ద్వారానే చేయించాలి.

ప్రతి షాప్‌లో కనీసం రెండు డీసిపి ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలి. అందులో ఒకటి 5 కిలోల సామర్థ్యం కలిగి ఉండాలి.

రెండు వాటర్ బ్యారెల్స్ ఏర్పాటు చేయాలి, అందులో ఒకటి కనీసం 200 లీటర్ల నీటితో నింపాలి.

షాపు పరిసరాల్లో పొగతాగడం నిషేధమని స్పష్టమైన బోర్డులు ఉండాలి.

18 ఏళ్ల లోపు వయస్సు గల వారిని పనిలో నియమించరాదు.

షాప్ చుట్టూ ప్రాంతం పరిశుభ్రంగా ఉంచాలి.

ప్రతి షాప్ మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.

ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పి. వినోద్ కుమార్ హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతను కాపాడేందుకు వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….