ప్రతి క్షణం
ప్రజల పక్షం

కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ఆడపిల్లలు.. తల్లిదండ్రుల నీడ లేక ఒంటరిగా మిగిలిన అక్కాచెల్లెళ్లు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి చదువే ఆశ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్‌లైన్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ నూతన ఎస్‌ఐ రఘుకు ఉపసర్పంచ్‌ల సంఘం ఘన సత్కారం

  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటోలో విజయవాడ ప్రయాణం – ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటోలో విజయవాడ ప్రయాణం – ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
ఏపీ, ఆధాబ్ న్యూస్:
ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా చేపట్టిన ప్రత్యేక పథకం ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఉండవల్లి లోటస్ పాయింట్ నుండి విజయవాడ సింగ్‌నగర్ వరకు ఆటోలో ప్రయాణించారు.

జి. రాజేష్ అనే ఆటో డ్రైవర్‌కి చెందిన ఆటోలో అతని కుటుంబంతో కలిసి ప్రయాణించిన పవన్ కళ్యాణ్, డ్రైవర్ జీవన విధానం, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రయాణికుల్లో ఎక్కువగా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు రాజేష్, “ఉదయం, సాయంత్రం స్కూలు పిల్లలను తీసుకువెళ్తాను. మిగిలిన సమయాల్లో సాధారణ ప్రయాణికులకు ఆటో అందుబాటులో ఉంచుతాను” అని తెలిపారు.

సి.ఎన్.జి. ఇంధనంతో నడిచే ఈ ఆటోలు పర్యావరణానికి మేలు చేస్తాయని, నగర రవాణాలో కొత్త దిశను చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు