ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గణేష్ నవరాత్రుల భద్రతపై ప్రత్యేక దృష్టి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

గణేష్ నవరాత్రుల భద్రతపై ప్రత్యేక దృష్టి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
గణేష్ నవరాత్రుల సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ—

ప్రతి మండల కేంద్రం, పట్టణ ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పహారా ఏర్పాటు చేయాలని,

శాంతిభద్రతలు కాపాడటానికి క్యూఆర్‌టీ బృందాలు, పహారా వాహనాలు సిద్ధంగా ఉంచాలని,

ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని,

ప్రజలతో సత్సంబంధాలు పెంచి, గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా పోలీసులు సమన్వయంతో పని చేసి నవరాత్రుల వేడుకలు ప్రశాంతంగా సాగేలాగా కృషి చేయాలని ఎస్పీ రోహిత్ రాజ్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్