ప్రతి క్షణం
ప్రజల పక్షం

టీబీ నిర్మూలనకు ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మిక తనిఖీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ పరిశీలన ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు ఆడపిల్లలు.. తల్లిదండ్రుల నీడ లేక ఒంటరిగా మిగిలిన అక్కాచెల్లెళ్లు.. ఒకరికి అనారోగ్యం, మరొకరికి చదువే ఆశ గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి సీపీఐ(ఎం) కరకగూడెం మండల కమిటీ విజ్ఞప్తి అనంతారంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఉచిత ఆన్‌లైన్ నమోదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలను ఆదుకోవాలి: తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ

  అశ్వాపురంలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీలు

అశ్వాపురంలో ఆర్టీవో ఆకస్మిక తనిఖీలు
అశ్వాపురం,ఆధాబ్ న్యూస్:
అశ్వాపురం మండల కేంద్రానికి సమీపంలోని గొల్లగూడెం బ్రిడ్జి వద్ద ఆర్టీవో పరుక్ ఆకస్మికంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా టాక్సీలను పరిశీలించారు. వాహనదారులు సమయానికి తమ వాహనాలకు టాక్స్ చెల్లించాలని, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలు నడపడం నేరమని ఆయన హెచ్చరించారు.

డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్టులు, హెల్మెట్లు వాడాలని, డ్రైవింగ్ సమయంలో లైసెన్స్, వాహన పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. అలాగే వాహనం నడుపుతూ సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు