ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కరకగూడెం మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. పినపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మొత్తం రూ.6,50,000 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో MRO గంట ప్రతాప్, MPDO మారుతి, సివిల్ సప్లయిస్ DT శివకుమార్, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మాజీ సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు, ఎర్ర సురేష్, మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్