ప్రతి క్షణం
ప్రజల పక్షం

  తాటిగూడెంలో ఆత్మీయంగా రాఖీ పండుగ

తాటిగూడెంలో ఆత్మీయంగా రాఖీ పండుగ
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:

కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంలో శనివారం రాఖీ పౌర్ణమి పండుగను సోదరులు–సోదరీమణులు ఆత్మీయంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం అలముకుంది. సోదరీమణులు సోదరుల చేతికి రాఖీలు కట్టి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కోరగా, సోదరులు జీవితాంతం రక్షణ వాగ్దానం చేశారు.

గ్రామంలోని పలు కుటుంబాలు రాఖీ పండుగను సంప్రదాయ బద్ధంగా నిర్వహించగా, పిల్లలు, పెద్దలు ఆనందంగా పాల్గొన్నారు. కొందరు సోదరులు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా గ్రామానికి చేరుకుని రాఖీ వేడుకల్లో పాల్గొనడం విశేషంగా మారింది. పండుగ సందర్భంగా గ్రామంలో ఐక్యత, ఆప్యాయత వాతావరణం నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్