ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కొత్త రూపంలో అంబులెన్సులు రోడ్డుపైకి! ఆంధ్రప్రదేశ్‌లో సంకల్పంగా సంజీవని సేవలు..

కొత్త రూపంలో అంబులెన్సులు రోడ్డుపైకి!

ఆంధ్రప్రదేశ్‌లో సంకల్పంగా సంజీవని సేవలు..
ఆంధ్రప్రదేశ్, ఆధాబ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్సులు త్వరలోనే నూతన రూపంలో ప్రజలకు సేవలందించనున్నాయి. ఇప్పటికే నీలం రంగులో దర్శనమిచ్చే వైకాపా ప్రభుత్వ కాలంనాటి అంబులెన్సుల స్థానంలో, ఇప్పుడు తెలుపు రంగు ఆధారంగా ఎరుపు, పసుపు రంగుల కాంబినేషన్‌తో ముస్తాబైన అత్యాధునిక అంబులెన్సులు రోడ్డుపైకి రానున్నాయి.

అత్యాధునిక సాంకేతిక పరికరాలతో, అత్యవసర పరిస్థితులకోసం అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ వాహనాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు రిఫ్లెక్టివ్ టేపులు కూడా అమర్చబడ్డాయి.

ఈ అంబులెన్సులు ‘సంజీవని’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలోని కుశలవ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ అంబులెన్సుల తయారీ వేగంగా కొనసాగుతోంది.

వాహనాలపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చిత్రాలు ముద్రించబడ్డాయి.

ఇది కూటమి ప్రభుత్వం వైపు నుండి ప్రజలకు అందించే అత్యవసర వైద్య సేవల్లో మరో కీలక ముందడుగు కానుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….