ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మోతే ఫీడర్ విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేత

మోతే ఫీడర్ విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేత

కరకగుడెం,ఆధాబ్ న్యూస్:
కరకగుడెం ఉపకేంద్రానికి చెందిన 11 కె.వి. మోతే ఫీడర్ పై మరమ్మత్తు పనులు నిర్వహించనున్న కారణంగా, ఆగస్టు 6 (బుధవారం) నాడు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎలక్ట్రికల్ శాఖ అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, కరకగుడెం 33/11 కె.వి. ఉపకేంద్రం పరిధిలోని మోతే లైన్ పై చెట్ల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో, ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మోతే ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడనుంది.

ఈ సందర్భంగా ఆపరేషన్ సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తూ, అసౌకర్యానికి లోనయ్యే వినియోగదారులు తాత్కాలికంగా సహనం వహించాలని విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్