ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణం నిలబెట్టిన కరకగూడెం ఆదివాసీలు

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:రోజుల
గడుస్తున్నా గిరిజన గ్రామాల వేదన తీరడం లేదు. తాజాగా కరకగూడెం మండలంలోని అతి మారుమూల ప్రాంతమైన నీలాద్రిపేట గ్రామంలో ఒక మహిళ ప్రాణాలు రక్షించేందుకు ఆ గ్రామస్థులు చేసిన సాహసం అందరికీ గుబురు తలెత్తేలా చేసింది.
పద్మాపురం పంచాయతీకి చెందిన మాడవి ఉంగమ్మ (36) అనే గిరిజన మహిళ బుధవారం తీవ్ర జ్వరం, విరోచనాలతో బాధపడుతూ అపస్మార స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సతీమణి పరిస్థితి విషమించడంతో భర్త మాడవి జోగయ్య వెంటనే గ్రామస్తులను ఆశ్రయించాడు.

ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో గ్రామస్థులు జెడ్డి సహాయంతో ఆమెను భుజాలపై మోసుకుంటూ, వాగులు, వంకలు దాటి ఆరు కిలోమీటర్లు కాలినడకన రోడ్డు దాకా తీసుకువచ్చారు. అక్కడికే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, వెంటనే స్పందించి మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఉంగమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఈ మారుమూల గ్రామానికి కనీస రహదారి లేకపోవడం వల్ల ప్రతి అత్యవసర సమయాన్ని మేము మరణభయంతో ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం కనీసం రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలి” అని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సంఘటన ఆదివాసీ జనజీవితంలో ఉన్న అసమానతలను, పరాధీనతలను బట్టబయలు చేస్తోంది. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా, ఇటువంటి గ్రామాల్లో మాత్రం ప్రాణాలు మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….