ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి – సీఎస్ కే. రామకృష్ణారావు

ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి – సీఎస్ కే. రామకృష్ణారావు

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కోండా సురేఖ ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అటవీ అధికారి కృష్ణ గౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్గొన్నారు.

ప్రధాన అంశాలు:

ఇందిరమ్మ ఇండ్లు: రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ కాగా, లక్షకు పైగా ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. వర్షాల కంటే ముందే నిర్మాణం బేస్‌మెంట్ స్థాయిలో పూర్తి చేయాలని సూచించారు. సీనరేజి ఛార్జీలను రద్దు చేసి ఉచిత ఇసుక అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: పెండింగ్ ఇండ్లను లబ్ధిదారుల ద్వారానే పూర్తి చేయాలని, అవసరమైన నిధులు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు.

పిఎం అవాస్ యోజన – అర్భన్ 2.0: కేంద్రం మంజూరు చేసిన 1.13 లక్షల ఇండ్లలో ప్రతి పట్టణంలో కనీసం 500 మందికి ఇండ్లు మంజూరు చేయాలన్నారు.

వనమహోత్సవం: మొక్కల పంపిణీ, సంరక్షణపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి జియో-కోఆర్డినేట్స్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఎరువుల లభ్యత: జూలై వరకు సరిపడే స్టాక్ అందుబాటులో ఉండగా, సెప్టెంబర్ నాటికి అవసరమైన స్టాక్‌ను ప్రొక్యూర్ చేస్తున్నామని తెలిపారు. రిటైల్ విక్రయాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు.

ఆయిల్ పామ్ పంట: లక్షా 25 వేల ఎకరాల్లో సాగు విస్తరణ లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

భూ భారతి దరఖాస్తులు: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 8.27 లక్షల దరఖాస్తులను ఆగస్టు 15 లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణ: డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధుల నియంత్రణకు చర్యలు, టీబీ నిర్ధారణ పరీక్షలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు.

మంత్రివర్యుల సూచనలు:

అటవీ శాఖ మంత్రి కోండా సురేఖ మాట్లాడుతూ, వనమహోత్సవంలో ప్రజల భాగస్వామ్యం పెంపొందించాల్సిన అవసరముందని అన్నారు. ప్రతి రోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ వివరాలు:

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, 58,345 దరఖాస్తులు భూ భారతి సదస్సుల ద్వారా స్వీకరించామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వనమహోత్సవం కింద 70 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, విద్యా చందన, వ్యవసాయ అధికారి బాబురావు, వైద్యాధికారి భాస్కర్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….