ప్రతి క్షణం
ప్రజల పక్షం

గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

  సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం..?.. తెలంగాణలో 18 జిల్లాలు ఔట్..

తెలంగాణలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిప్రజాపాలన అందించేవిధంగా పాలన సాగిస్తున్నారు.దీనిలో భాగంగానే ఇప్పటికే ఆరు గ్యారంటీల పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్రీబస్సు పథకంకు తెలంగాణలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ హాయాంలో జరిగిన మోసాలు,కుంభకోణాలను బైటకు తీస్తు, పాలనను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ లలో సైతం తెలంగాణ స్టేట్ అంటూ వచ్చేలా జీవో జారీ చేశారు. ఇక దేశంలో లోక్ సభ, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. లోక్ సభ ఎన్నికలలో క్లీన్ స్వీప్ దిశగా చర్యలు చేపట్టింది.

 

ఇదిలా ఉండగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణలో జిల్లాలను పునుర్విభజన చేసి 33 జిల్లాలుగా రూపొందించారు. తాజాగా, ఇప్పుడు జిల్లాలను మరోసారి జిల్లాలను 33 నుంచి 17 కు తగ్గిస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో రాష్ట్రంలో ప్రకంపనలు నెలకొన్నాయి. దీనిపై కొందరు బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అంటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాలు:

ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం

దీనిపై ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్ సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయంకు గురిచేస్తున్నట్లు సమాచారం.

జిల్లాల పునర్విభజన చేస్తే కలిగే నష్టాలు:

ఆయా జిల్లాలలో, వ్యవసాయ భూముల ధరలు, రియల్ ఎస్టేట్ భూముల ధరలుపడిపోతాయి,
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్ లన్ని తిరగరాయాలిపోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….