ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్

ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్

పినపాక, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ.కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం ప్రజాపంథా ప్రతినిధి బృందం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో మౌలిక వసతుల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.

“గ్రామానికి సరైన రహదారి లేకుండా, ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ గర్భిణీ స్త్రీని హాస్పిటల్‌కి తీసుకెళ్లే సమయంలో, వాహనాలు రాకపోవడంతో మంచానికి జట్టి కట్టి రెడ్డిగూడెం వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది. అటుపైనే వాహనంలో తరలించగలిగాం,” అని మధుసూదన్ రెడ్డి తెలిపారు.

అత్యవసర వైద్యం, విద్య, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేక గ్రామస్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ గ్రామాలు కనీస సదుపాయాలకు నోచుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….