ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  దేశవ్యాప్తంగా మే 20న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు

దేశవ్యాప్తంగా మే 20న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కార్మిక సంఘాల పిలుపు
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ, మే 20న జరుగనున్న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం ఓసి-4 దుర్గా ఓబి కంపెనీ సమీపంలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో వివిధ కార్మిక సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు.

ఈ సమావేశంలో వెలగపల్లి జాన్ (INTUC), జి. వెంకటేశ్వర్లు (AITUC), బి. మధు (CITU), ఆర్. మధుసూదన్ రెడ్డి (TUCI), వరదల సమ్మయ్య (CKHPS) పాల్గొన్నారు. అనంతరం ఓబి కంపెనీ యాజమాన్యానికి సమ్మె నోటీసు కూడా అందజేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మికుల హక్కులను కాలరాస్తూ విధానాలు అమలు చేస్తున్నదని నేతలు విమర్శించారు. పూర్వ కాలంలో కార్మికుల పోరాటాల ద్వారా సాధించిన 8 గంటల పని దినం, సమ్మె హక్కు, సంఘం స్థాపన హక్కు వంటి ప్రాథమిక హక్కులను నాలుగు లేబర్ కోడ్స్‌తో ప్రభుత్వం హరించబోతోందని పేర్కొన్నారు.

ఈ లేబర్ కోడ్స్ అమలవుతే కార్మిక వర్గం యాజమాన్యాల కాపాలపై ఆధారపడే స్థితిలోకి దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల ఈ కోడ్స్‌ను తిప్పికొట్టే బాధ్యత కార్మిక వర్గంపై ఉందని స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్లతో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుందని నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జి. శ్రీనివాస్, సీతారాములు, యాకన్న, ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలపాలంటూ పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….