ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి: సిపిఎం

నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి: సిపిఎం

కరకగూడెంలో ప్రజా ధర్నా నిర్వహించిన సిపిఎం – పోడు రైతులకు హక్కు పత్రాలు, మహిళలకు మహాలక్ష్మి పథకం, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ డిమాండ్

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మండల కార్యదర్శి కొమరం కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ, నిజమైన నిరుపేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే, మండలంలో మిగిలిపోయిన పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, త్రీఫేస్ కరెంట్‌తో వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు ఉన్నవారికి పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500, గ్యాస్ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ డిమాండ్లు నెరవేరకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని, అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల ముందు వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

గత 40 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, వాటి లేనితనంతో విద్యాభ్యాసం, భూహక్కులలో అవరోధాలు ఏర్పడుతున్నాయని అధికారులకు గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో చర్ప సత్యం, కనితి రాము, పద్దం బాబురావు, శోభారాణి, లక్ష్మయ్య, పదం సత్యం, రమాదేవి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….