ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి ఖమ్మం, ఆధాబ్ న్యూస్:

ఏజెన్సీ అభివృద్ధిపై మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. అడవుల సంరక్షణ, రహదారుల నిర్మాణం, టూరిజం అభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు వంటి అంశాలపై మంత్రి తుమ్మల ఔత్సాహికంగా చర్యలు చేపడుతున్నారు.

సచివాలయంలో ప్రధాన అటవీ సంచాలకులు (PCCF) శ్రీమతి సువర్ణ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD సునీతతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అటవీశాఖ పెండింగ్ సమస్యల పరిష్కారం, అడవుల సంరక్షణ, వన సంపద పరిరక్షణపై సుదీర్ఘంగా చర్చించారు.

అటవీశాఖ అనుమతులు పెండింగ్‌లో ఉన్న రహదారుల నిర్మాణానికి తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ప్రధాన రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని PCCFను కోరారు. జూలూరుపాడు, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, దుమ్ముగూడెం మండలాల్లో ఈ రహదారులు ప్రతిపాదితమయ్యాయి.

అలాగే, టూరిజం అభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఖమ్మం వెలుగుమట్ల పార్క్, సత్తుపల్లి, తల్లాడ మండలాల్లో కనిగిరి హిల్స్ ఎకో టూరిజం, కొత్తగూడెంలో ఎకో పార్క్ అభివృద్ధికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆధునిక సౌకర్యాలతో ఈ పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు.

గిరిజన ఆదాయ వనరుల పెంపుదల దిశగా చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములలో వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గిరిజనుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గతంలో ఉన్న ప్రాధాన్యతను మళ్లీ తెచ్చేలా, అటవీ సంచాలకులు మరియు కార్పొరేషన్ అధికారులు పనిచేయాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. వన సంరక్షణతోనే ప్రకృతి పరిరక్షణ సాధ్యమవుతుందని, ఇది మనవజాతి భవిష్యత్తుకు అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….