ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  కదలని బస్సు నెట్టిన ప్రయాణికులు – మధిర డిపో బస్సుల స్థితిపై విమర్శలు

కదలని బస్సు నెట్టిన ప్రయాణికులు – మధిర డిపో బస్సుల స్థితిపై విమర్శలు

ఎర్రుపాలెం, మే 9 ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర రోడ్డుబస్సుల పరిస్థితిపై ప్రయాణికులు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 6:30 సమయంలో మధిర డిపోకు చెందిన విజయవాడ గమ్యమైన టీఎస్ ఆర్టీసీ బస్సు (AP29Z2113) ఎర్రుపాలెంలో అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులకెక్కువ ఇబ్బంది కలిగింది.

బస్సు స్టార్ట్ కాకపోవడంతో అందులో ఉన్న దాదాపు పది మంది ప్రయాణికులు దిగిపోయి స్వయంగా బస్సును వెనుకనుంచి నెట్టారు. కండక్టర్ సహా ప్రయాణికులు ప్రయత్నించిన తర్వాతే బస్సు కదిలింది.

ఇలాంటి సంఘటనలు మధిర డిపో బస్సుల నాణ్యతపై సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నాయి. “ఉచిత బస్సు ప్రయాణ పథకాలు వున్నా, ప్రయాణం నెట్టుకుంటూ వెళ్లాల్సిన స్థితి వచ్చింది,” అంటూ ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.

బస్సులన్నీ చాలా కాలం క్రితమే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినట్లు ప్రజలు వ్యాఖ్యానించారు. బస్సులను నెట్టే స్థితి రావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ప్రజలు కొత్త బస్సులు ప్రవేశపెట్టి తమ ప్రయాణాన్ని సురక్షితంగా, నిరవధికంగా కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….