ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  జర్నలిస్టులకు శుభవార్త: ఇళ్ల మంజూరుతో పాటు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి హామీ

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:

రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద జర్నలిస్టులు మరియు వృత్తి నిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల కారణంగా పనిచేయలేని జర్నలిస్టులకు మద్దతుగా ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నెలసరి పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు.

మండల మరియు నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే జర్నలిస్టుల ధైర్యాన్ని మంత్రి ప్రశంసించారు. ఈ వృత్తిని జీవిత లక్ష్యంగా ఎంచుకొని అంకితభావంతో పనిచేస్తున్న వారిని ప్రభుత్వం మరువదని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.42 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పెట్టిందని, వాటి వడ్డీ ద్వారా రూ.22 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ నిధులను ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్లు మంత్రి వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….